Site icon NTV Telugu

Samantha: చీరలు అమ్మాయిలకి మంచి ఫ్రెండ్స్.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Samantha

Samantha

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చీరలు ప్రతి అమ్మాయికి మంచి ఫ్రెండ్స్ వంటివి అని అన్నారు. ఈ షోరూమ్‌లో శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయని అన్నారు. భారతీయ హస్తకళలు, చేనేత శారీల ప్రాధాన్యతను వివరించారు.

READ ALSO: Motorola Edge 50 Pro: డీల్ అదిరింది.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ. 17000 ల డిస్కౌంట్.. ప్రీమియం ఫీచర్లు

సిరిమల్లె శారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ షోరూమ్ ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తి పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉండే ప్రతి కలెక్షన్స్ కస్టమర్ అభిరుచి మేరకు మేము తయారు చేయిస్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో సమంత అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

READ ALSO: Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే.. విన్నర్ ఎవరో తెలుసా?

Exit mobile version