NTV Telugu Site icon

Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత..

Samantha

Samantha

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా తర్వాత హీరోయిన్ సమంత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతుంది. ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లి ఆ తర్వాత కొన్ని రోజులు మయోసైటిస్ వ్యాధి బారిన పాడిన ఆవిడ పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రశాంతంగా గడిపింది. ఇక తాజాగా భారతదేశానికి తిరిగి వచ్చింది సమంత. ఇకపోతే షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ అతి త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ద్వారా సమంతా నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించబోతోంది. అయితే వెబ్ సిరీస్ సంబంధించి ఇంకా ఎలాంటి డేట్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ వెబ్ సిరీస్ తో పాటు మరో సినిమాలో కూడా తాజాగా అనౌన్స్ చేసింది సమంత. దింతో ఇప్పుడిప్పుడే సమంత మరోసారి సిల్వర్ స్క్రీన్ కనపడేందుకు బిజీబిజీగా గడిపేస్తోంది.

Congress: ‘‘ మోడీకి చట్టం వర్తించదా..?’’ ధ్యానం ఫోటోపై దిగ్విజయ్ సింగ్ ఫైర్..

తాజాగా ఓ యాడ్ లో బాలీవుడ్ హీరో సరసన నటించింది సమంత. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారం జొమాటో యాడ్ సందర్భంగా హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ సమంత నటించారు. ఈ యాడ్ లో అందరూ ఇండియా మ్యాచ్ చూస్తుండగా.. ఆ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. అలా మ్యాచ్ చూస్తూ ఫుడ్ ను తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో హీరో హీరోయిన్లు ఇద్దరు వరల్డ్ కప్ గెలడమే కావాలని మరేం అవసరం లేదని చెబుతారు.

Pooja Hegde : పచ్చదనం – పరిశుభ్రత బాటలో బుట్టబొమ్మ.. పిక్స్ వైరల్..

దాంతో చివరగా టీమిండియా విజయం సాధించగా., ఇండియా.. ఇండియా.. అంటూ ఉత్సాహంగా అరుస్తూ సంబరపడతారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని ఒకసారి వీక్షించండి.

Show comments