NTV Telugu Site icon

Microsoft: మైక్రోసాఫ్ట్‌లోకి సామ్‌ ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్.. స్వయంగా ప్రకటించిన సత్య నాదెళ్ల

Microsoft

Microsoft

Microsoft: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందరినీ ఆశ్చర్యపరిచారు. మైక్రోసాఫ్ట్‌లో చాట్‌జీపీటీ డెవలపర్ ఓపెన్‌ఏఐ నుంచి సామర్థ్యంపై నమ్మకం లేదనే కారణంతో ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తన పదవి నుంచి తొలగించబడ్డారు. కంపెనీ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ సీఈవో పదవి నుంచి తొలగించబడిన వెంటనే ఓపెన్‌ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ రెండు ఒకటే రోజు జరగడం టెక్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓపెన్‌ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్, సామ్‌ ఆల్ట్‌మాన్‌ మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నట్లు సత్య నాదెళ్ల సోమవారం మధ్యాహ్నం ట్విటర్‌ వేదికగా స్వయంగా తెలిపారు. ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యానికి మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని కూడా నాదెళ్ల చెప్పారు.

సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్‌ బ్రాక్‌మన్ కలిసి మైక్రోసాఫ్ట్‌ ఏఐ టీమ్‌కు నేతృత్వం వహించనున్నట్లు సత్య నాదెళ్ల తెలిపారు. వారి విజయానికి కావాల్సిన వనరులను సమకూర్చేందుకు వేగంగా చర్యలు చేపడతామని ట్విట్టర్(ఎక్స్) వేదికగా వెల్లడించారు. దీనిని సామ్‌ ఆల్ట్‌మన్‌ కూడా ధ్రువీకరించారు. తమ లక్ష్యం కొనసాగుతుందంటూ ట్విట్టర్‌(ఎక్స్)లో పేర్కొన్నారు.

Also Read: ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!

ఇదిలా ఉండగా.. వీడియో స్ట్రీమింగ్ సైట్ ట్విచ్‌ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్‌ను కొత్త తాత్కాలిక సీఈవోగా ఓపెన్‌ఏఐ బోర్డు నియామకం చేసింది. ఆల్ట్‌మన్‌ను తొలగించిన వెంటనే సీఈఓ బాధ్యతలను మిరా మురాటి స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కూడా ఆల్ట్‌మన్‌కు మద్దతు ప్రకటించడంతో తక్షణమే మరో వ్యక్తిని ఆ పదవిలోకి తీసుకురావడం ఓపెన్‌ఏఐకి తప్పనిసరి అయింది. షియర్‌ ట్విచ్‌కు సీఈఓగానూ వ్యవహరించారు. 2014లో ట్విచ్‌ను అమెజాన్‌ కొనుగోలు చేసింది. ఎమ్మెట్‌ షియర్‌ నియామకాన్ని సత్య నాదెళ్ల కూడా ధ్రువీకరించారు.

సత్య నాదెళ్ల ఏమన్నారు?
సత్య నాదెళ్ల ఎక్స్‌లో ఇలా వ్రాశారు, ‘మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యానికి కట్టుబడి ఉంది. దాని ఉత్పత్తి రోడ్‌మ్యాప్‌పై నమ్మకంగా ఉంది. ఓపెన్‌ఏఐ కొత్త సీఈవో, ఎమ్మెట్ షియర్ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేయడం కోసం కంపెనీ ఉత్సాహంగా ఉంది. ఆల్ట్‌మాన్, బ్రాక్‌మాన్ మైక్రోసాఫ్ట్‌లో వారి సహోద్యోగులతో చేరుతున్నారని, అక్కడ వారు కొత్త అధునాతన ఏఐ బృందానికి నాయకత్వం వహిస్తారని ప్రకటించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇందుకోసం వారికి అవసరమైన వనరులను అందజేస్తారు. సత్య నాదెళ్ల పోస్ట్‌ను షేర్ చేస్తూ, సామ్ ఆల్ట్‌మాన్ ఎక్స్‌లో ‘ది మిషన్ కంటిన్యూస్’ అని రాశారు.

మరికొందరు పరిశోధకులు రాజీనామా
ఆల్ట్‌మాన్ తొలగింపు మరియు గ్రెగ్ బ్రాక్‌మాన్ రాజీనామా తర్వాత, ఓపెన్‌ఏఐ నుంచి ముగ్గురు సీనియర్ పరిశోధకులు కూడా రాజీనామా చేశారు. అనేక మంది ఇతరులు నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నారు. ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, ఓపెన్‌ఏఐ రీసెర్చ్ డైరెక్టర్ జాకుబ్ పచోకీ, ఏఐ రిస్క్ అసెస్‌మెంట్ హెడ్ అలెగ్జాండర్ మాడ్రీ, దీర్ఘకాల పరిశోధకుడు స్జిమోన్ సిడోర్ రాజీనామా చేశారు. “ఆల్ట్‌మాన్ తొలగింపు తర్వాత కొంతమంది ఉద్యోగులు నిష్క్రమించడం తీవ్ర నిరాశకు సంకేతం, చాట్‌జీపీటి డెవలపర్‌లలో చాలా కాలంగా ఉన్న వ్యత్యాసాలను హైలైట్ చేస్తుంది” అని నివేదిక పేర్కొంది.