NTV Telugu Site icon

Sikandar Teaser : ‘సికందర్’ టీజర్ విడుదల.. యాక్షన్‌తో పిచ్చెక్కించిన సల్మాన్..

Sikandar

Sikandar

సికందర్ ఒక యాక్షన్ చిత్రం.. ఇందులో సల్మాన్ తో పాటు కాజల్ అగర్వాల్ , రష్మిక మందన్న , సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కూడా నటించారు. సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సికందర్’ టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి  ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. టీజర్ చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. సల్మాన్ యాక్షన్ తో అద్దరగొట్టేశాడు. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఒక గంటలోనే దాదాపు 8లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా.. ఈ టీజర్ హిందీలో విడుదలైంది.

READ MORE: Idli-making: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ నిషేధం.. క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..

ఈ టీజర్ సల్మాన్ డైలాగ్ తో మొదలవుతుంది. “అమ్మమ్మ అతనికి సికందర్ అని పేరు పెట్టింది. తాత అతనికి సంజయ్ అని పేరు పెట్టాడు. కానీ.. జనాలు అతనికి రాజా సాహెబ్ అని పేరు పెట్టారు.” అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్‌ మొత్తం యాక్షన్, ఫైట్స్ ఉండగా.. రష్మికతో సల్మాన్ రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా కనిపించింది. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా.. ఈ చిత్రం 28 మార్చి 2025న విడుదల అవుతుంది.

READ MORE: Kedar: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సినీ నిర్మాత కేదార్ మృతి..