Site icon NTV Telugu

Salman Khan: మెగాఫోన్ పట్టనున్న ఖాన్..

Salmankhan

Salmankhan

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇండియా వైడ్ సూపర్ క్రేజీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. కానీ, ఈ మధ్య ఆయన చేస్తున్న ఏ సినిమా కూడా వర్కౌట్ కావడం లేదు. నిజానికి, ఆయన గతంలో కూడా దర్శకులుగా కొందరి పేర్లు వేసి, ఆయన స్వయంగా డైరెక్ట్ చేశారనే పేరు ఉంది. కానీ, ఎప్పుడూ ఆయన దర్శకత్వం చేసినట్లు ఆ క్రెడిట్స్ తీసుకోలేదు. కానీ, ఆయన ఇప్పుడు ఒక సినిమాకి దర్శకుడిగా మారబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read : Orry Drug Case: రూ.252 కోట్లు డ్రగ్స్ కేసులో ఓర్రీకి ముంబై పోలీసుల నోటీసులు

సల్మాన్ ఖాన్ కెరీర్‌లో దబాంగ్ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ సిరీస్‌లోనే దబాంగ్ 4 సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కాబోతోంది. ఈ సినిమాలో ఆయన చుల్బుల్ పాండే పాత్రలో మళ్లీ కనిపించనుండగా, సోనాక్షి సిన్హా ఆయన సరసన భార్య పాత్రలో నటించబోతోంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్, బాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version