‘వారిసు’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో తీయబోతున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 2026 నుండే ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, సల్మాన్ ఖాన్ మార్క్ యాక్షన్ కలగలిసి ఈ సినిమా ఒక పక్కా పాన్-ఇండియా ఎంటర్టైనర్‌గా రాబోతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరో వార్త వైరల్ అవుతుంది.
Also Read : Rakasa: ‘పెద్ది’ సెట్స్‌లో ‘రాకాస’ సందడి.. టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్!
సౌత్ వెర్సటైల్ యాక్టర్ అరవింద్ స్వామి ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన నెగటివ్ రోల్ చేస్తారని అందరూ ఊహించారు కానీ.. తాజా వార్తల ప్రకారం అరవింద్ స్వామి ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాజిటివ్ పాత్రలో కనిపించబోతున్నారట. సల్మాన్, అరవింద్ స్వామిల మధ్య వచ్చే సీన్లు సినిమాకు మేజర్ హైలైట్ అవుతాయని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ విలన్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్‌ను చిత్ర బృందం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ కపూర్ కనుక నిజంగానే ఈ ప్రాజెక్టులోకి వస్తే, సల్మాన్ ఖాన్‌తో ఆయర ఫేస్ ఆఫ్ సీన్లు బాక్సాఫిస్ వద్ద పూనరాలు తెప్పించడం ఖాయం. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
