బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన వార్ డ్రామా ‘మాతృభూమి’ (గతంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్) పనుల్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి, 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ కోసం మొదటిసారిగా ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పని చేస్తుండటం విశేషం. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.
Also Read : Lenin : అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై మాస్టర్ ప్లాన్..?
ఈ సినిమాలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తాజా సమాచారం. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నయన్, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో తొలిసారి జోడీ కడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు, ఈ సినిమాలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వంశీ పైడిపల్లికి బాలీవుడ్ డెబ్యూ కానుంది. నయనతార ప్రస్తుతం యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తూనే, ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సౌత్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, బాలీవుడ్ టాప్ స్టార్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
