Salman Khan Sister : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ ఇళ్లలో దొంగతనాలు పెరిగిపోయాయి. ఇంట్లో ఉండే విలువైన బంగారు, వజ్రాభరణాలపై కన్నేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… స్టార్ హీరోలు, హీరోయిన్‌ల ఇళ్లలో చోరీకి పాల్పడుతుంది బయటి వ్యక్తులు కాదు… నమ్మకంగా ఉంటారని ఇంట్లో పెట్టుకున్న పని వాళ్లు, డ్రైవర్లు, వ్యక్తిగత సిబ్బందే. అర్పితాఖాన్‌శర్మ ఇంట్లో సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే డైమండ్ ఇయర్ టాప్స్ దొంగతనానికి గురైనట్లుగా అర్పితాఖాన్ కుటుంబ సభ్యులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెవి పోగులు దొంగిలించిన వ్యక్తి అర్పితాఖాన్ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని నిందితుడిని పట్టుకున్నారు. అతడు దొంగిలించిన ఐదు లక్షల రూపాయల విలువ చేసే చెవిపోగులను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జరిగిన చోరీతో పాటు గతంలో ఏవైనా చోరీలకు పాల్పడ్డాడా అనే కోణంలో నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Read Also:MP Margani Bharat: ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు
ఇప్పటికే సల్మాన్‌ను చంపేస్తామని వరుస బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో స్టార్ హీరో ఇంటి దగ్గర భద్రత పెంచారు. అయితే ఆయ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో పని వాళ్లు ఈవిధంగా చోరీకి పాల్పడంతో బంధువుల ఇళ్లలో కూడా ప్రైవేట్ సెక్యురిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో కూడా ఇదే విధంగా భారీ చోరీ జరిగింది. అప్పుడు సోనమ్ కపూర్ గర్భవతిగా ఉండటంతో ఆమెకు సహాయకురాలిగా నర్సును నియమించారు. ఆ నర్సు భర్త సహాయంతో సుమారు రూ.2.4కోట్ల విలువైన నగలను మాయం చేస్తే పోలీసులు గుర్తించారు. నర్సు అపర్ణ ఆమె భర్తను అరెస్ట్ చేసారు. దొంగిలించిన నగలను రికవరీ చేసి సోనమ్‌కపూర్‌కి అందజేశారు. తర్వాత హీరో ధనుష్ భార్య, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పనిమనిషి చోరీ చేసింది. ఐశ్వర్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని కేసును చేధించి నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమెకు సహాకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసారు.
Read Also:Adipurush: ప్రీమియర్స్ క్యాన్సిల్… మేకర్స్ కి ముందు జాగ్రత్త బాగానే ఉంది
