Adipurush: ప్రీమియర్స్ క్యాన్సిల్… మేకర్స్ కి ముందు జాగ్రత్త బాగానే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ థియేటర్లోకి రావడానికి మరో నెల రోజులు మాత్రమే ఉంది. జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారనున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌తో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఖచ్చితంగా ఓం రౌత్ ‘ఆదిపురుష్’తో వండర్స్ క్రియేట్ చేస్తాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ముఖ్యంగా ఆదిపురుష్ ఓపెనింగ్స్ రికార్డ్ ఓ రేంజ్‌లో ఉండే ఛాన్స్ ఉంది. అందుకే మూడు రోజుల ముందుగా వేయాల్సిన ఆదిపురుష్ ప్రీమియర్స్ షోని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని.. న్యూయార్క్ వేదికగా జూన్ 7 నుంచి 18 వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్‌లో.. జూన్ 13న ప్రీమియర్స్‌ను ప్లాన్ చేశారు.
ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రీమియర్ షోస్ కూడా పెంచారు. అయితే ఇప్పుడు జూన్ 13 ఉండాల్సిన షోని క్యాన్సిల్ చేసి.. జూన్ 15కి మార్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రీమియర్ షోని క్రిటిక్స్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు చూడనున్నారు. దాంతో సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందే ఆదిపురుష్ టాక్ బయటకు వచ్చేస్తుంది. సినిమా టాక్ బాగుంటే ఓకే గానీ.. ఏ మాత్రం నెగెటీవ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ పై దెబ్బ పడే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఆదిపురుష్ ప్రీమియర్స్ ఎక్కడ పడినా క్షణాల్లో టాక్ వరల్డ్ వైడ్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే ప్రీమియర్స్ కాన్సిల్ చేసినట్టు సమాచారం. జూన్ 15న ప్రీమియర్ కానున్న ఆదిపురుష్ సినిమా నిడివి రెండు గంటల యాభై నాలుగు సినిమాలట. ఇదే ఫైనల్ డ్యురేషన్ అయ్యే అవకాశం ఉంది.
Also Read
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
తాజావార్తలు
-
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..