Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనను చంపేస్తామంటూ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిగా అతడి స్నేహితుడు సిద్ధిఖ్ ని చంపేయడంతో ఇప్పుడు సల్మాన్ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. సల్మాన్, అతడి ఇంటి చుట్టూ హైసెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇది వరకు చాలా సార్లు ఇలా హత్యా బెదిరింపులు వచ్చినా కూడా ఈ సారి సల్మాన్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. గ్యాంగ్ స్టర్ నుంచి ముప్పు పొంచి ఉండడంతో చాలా కాలంగా కోట్లాది రూపాయల ఖర్చుతో స్వయంగా భద్రతను ఏర్పాటు చేసుకుంటున్న సల్మాన్ పలుమార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం తనకు ఉన్న పాత బుల్లెట్ ప్రూఫ్ కార్లపై అతడికి నమ్మకం లేదు. దీంతో ఖరీదైన మరో కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కొనుగోలు చేశాడు. సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also:Sarfaraz-Pant: భాయ్ వెనక్కి వెళ్లిపో.. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్! నవ్వుకుండా ఉండలేరు
బాలీవుడ్ సొసైటీ నివేదిక ప్రకారం.. సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారని తెలుస్తుంది. భారత మార్కెట్లో ఈ కారు అందుబాటులో లేనందున దుబాయ్ నుంచి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. కారు ధర ట్యాగ్ సుమారు రూ.2 కోట్లని తెలుస్తుంది. ఈ కారును త్వరగా భారతదేశానికి తీసుకురావడానికి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నాడని సమాచారం. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… నిస్సాన్ ఎస్.యు.వి అనేక అధునాతన భద్రతా ఏర్పాట్లను కలిగి ఉంది. పేలుడు హెచ్చరిక సూచికలు, పాయింట్-బ్లాంక్ బుల్లెట్ షాట్‌లను నిరోధించడానికి మందపాటి గాజు షీల్డ్‌లు, డ్రైవర్ లేదా ఇన్ సైడ్ ఉన్న ప్రయాణీకులను గుర్తించకుండా మభ్య పెట్టే బ్లాక్ షేడ్స్ వగైరా ఏర్పాటు ఉంటుంది. సల్మాన్‌కు గత ఏడాది కూడా యూఏఈ నుంచి బుల్లెట్‌ప్రూఫ్ కారును కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు రెండోసారి గల్ఫ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశాడు. తనకు తన తండ్రి సలీం ఖాన్‌కు మొదటిసారిగా బిష్ణోయ్ గ్యాంగ్ నుండి హత్య బెదిరింపులు వచ్చాయి. అప్పటి నుంచి ఈ భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. శుక్రవారం బిగ్ బాస్ 18 షూటింగ్‌కు సల్మాన్ ఖాన్ భారీ భద్రత మధ్య తిరిగి వచ్చారు. బాబా సిద్ధిక్ హత్యకు గురైన తర్వాత అతడు గత వారం రోజుల్లో తిరిగి పనిలోకి రావడం ఇదే మొదటిసారి.
Read Also:TB Disease: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే టిబి కావొచ్చు.. జాగ్రత్త సుమీ