Site icon NTV Telugu

Sikandar: సల్మాన్ ‘సికందర్’ షూటింగ్ ప్రారంభం.. 200 కోట్ల భారీ బడ్జెట్‌!

Sikandar

Sikandar

Salman Khan Sikandar Movie Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘సికందర్’. మురుగదాస్, సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. సికందర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా?, సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న అభిమానుల‌కు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. మంగళవారం (జూన్ 18) ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

Also Read: T20 World Cup 2024: రోహిత్‌తో గొడవ.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు ఐసీసీ షాక్‌!

తాజాగా సికందర్ షూటింగ్ సెట్స్‌లో ఉన్న ఫోటోను స‌ల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెట్స్‌లో మురుగ‌దాస్, సాజిద్ నడియాద్వాలాతో ఉన్న ఫొటోను సల్మాన్ షేర్ చేశారు. ఈ సినిమాను 2025 ఈద్ కానుక‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. సికందర్ సినిమాను నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ సోయగం ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version