Site icon NTV Telugu

Bharat Rice: రేపటి నుంచి ‘భారత్ రైస్’ అమ్మకాలు.. ఎక్కడ లభించనున్నాయంటే..!

Bharat Rice

Bharat Rice

బియ్యం ధర తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్‌ను ప్రారంభించనట్లు ప్రకటించింది. కిలో బియ్యాన్ని రూ.29కే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి భారత్‌ బ్రాండ్‌తో కూడిన భారత్‌ రైస్‌ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యం NAFED, NCCF, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని పెద్ద చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో అందుబాటులో ఉంటుంది.

Read Also: Indore: మాట్లాడటం లేదని మహిళ ఇంటికి నిప్పు అంటించిన ఓ వ్యక్తి..

ఇప్పటికే.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇంతకుముందు కూడా భారత్ బ్రాండ్‌తో తక్కువ ధరకు పిండి, పప్పులు, చౌక ఉల్లిపాయలు, టమోటాలను విక్రయించడం గమనార్హం. ఇందులో భారత్ గోధుమపిండిని 6 నవంబర్ 2023న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో దేశంలో సగటు పిండి ధర కిలో రూ.35 ఉండగా, ప్రభుత్వ చొరవతో రూ.27.50కి లభిస్తుంది. కాగా శనగపప్పును కిలో రూ.60కి లభిస్తుంది. కాగా.. ఈ-కామర్స్‌ వేదికల్లో భారత్ బ్రాండ్ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా.. భారత్ రైస్ తో సామాన్యులకు లాభం చేకూరనుంది.

Read Also: Botsa Satyanarayana: వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ రావడం ఖాయం..

Exit mobile version