Salaar : బంపర్ ఆఫర్ ప్రకటించిన సలార్ టీం..ఆ ఆఫర్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ సీజ్ ఫైర్ 1. ఈ సినిమాను కేజీఎఫ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది.సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు. అలాగే జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావ్ మరియు శ్రియ రెడ్డి వంటి వారు ముఖ్యమైన పాత్రలు పోషించారు.ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు..కెజిఎఫ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన హోంబలె ఫిల్మ్ ఈ సలార్ ను కూడా తెరకెక్కించింది.
ఇదిలా ఉంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ట్రైలర్ నేడు (డిసెంబర్ 1) సాయంత్రం 7.19 గంటలకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ట్రైలర్ రిలీజ్ కు ఒక రోజు ముందు గురువారం (నవంబర్ 30) సలార్ టీమ్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో ఈ ఫొటోను షేర్ చేసింది. “బెస్ట్ 5 క్యాప్షన్లకు మీ దగ్గర్లోని థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లతోపాటు సలార్ మెర్చండైజ్ కూడా గిఫ్ట్ గా ఇస్తాం. సలార్ సీజ్‌ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1 సాయంత్రం 7.19 గంటలకు రానుంది” అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను షేర్ చేశారు.ఇక ట్రైలర్ రిలీజ్ పై నెలకొన్న ఉత్కంఠను మరింత పెంచుతూ సలార్ టీమ్ గురువారం (నవంబర్ 30) ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేయడం విశేషం. అధీర ఎడిట్ చేసిన ఈ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ డిసెంబర్ 1 సాయంత్రం 7.19 గంటలకు పేలడానికి సిద్ధంగా ఉందంటూ సలార్ టీమ్ ఈ ప్రోమో పోస్ట్ చేసింది.ఈ ప్రోమో ట్రైలర్ పై అంచనాలను మరింత పెంచేసింది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో పిచ్చెక్కించింది. సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్ మూవీ డిసెంబర్ 22న ఎంతో గ్రాండ్ గా జరిగింది.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Tags
- prabhas
- Prashanth Neel
- salaar
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!