టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన సుహాస్ సక్సెస్ ఫుల్ హీరోగా రానిస్తున్నాడు. ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు సుహాస్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు..ఈ క్రేజీ హీరో నటించిన వరుస చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆ చిత్రంలో నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .ఆ సినిమా సూపర్ హిట్ అయింది .ఆ తరువాత నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.హీరోగా రానిస్తూనే సుహాస్ “హిట్ 2” చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు.సైకో గా సుహాస్ నటన అద్భుతం అని చెప్పాలి .
ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన “అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్” చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఇటీవల సుహాస్ నటించిన శ్రీరంగ నీతులు అనే చిత్రం కూడా విడుదలయింది. అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మే 3న ఈ హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు .సుహాస్ నటించిన “ప్రసన్న వదనం” చిత్రం మే 3న రిలీజ్ అవుతోంది.ఇదిలా ఉంటే తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఊహించని విధంగా ఈ చిత్ర రిలీజ్ కోసం సలార్ , కెజిఎఫ్ నిర్మాతలు రంగంలోకి దిగారు.కర్ణాటకలో సలార్ చిత్రాన్ని నిర్మించిన హోంబాలే సంస్థ ప్రసన్నవదనం చిత్రాన్నిరిలీజ్ చేస్తుంది. సుహాస్ చిత్రం కోసం పాన్ ఇండియా నిర్మాతలే పోటీ పడుతున్నారు..ఈ చిత్రాన్ని అర్జున్ వైకె దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వస్తున్నఈ చిత్రం ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధం అవుతోంది. సుహాస్ ఈ సినిమాతో కూడా మరో విజయాన్ని అందుకుంటాడా లేదో చూడాలి .