NTV Telugu Site icon

Salaar: అక్కడ రిలీజ్ కాబోతున్న ప్రభాస్ ‘సలార్’.. ఎప్పుడంటే..

Salar Japan

Salar Japan

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుఖుమ్రాన్, జగపతి బాబు, శ్రేయా రెడ్డి, శృతిహాసన్, లాంటి యాక్టర్స్ ముఖ్య పాత్రలు పోషించిన ‘సలార్’ భారీ విజయాన్ని సాధించింది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన “సలార్” చిత్రం బాక్సాఫీస్ వద్ద 700 కోట్లను కొల్లగొట్టింది. ఆ తరువాత, సాలార్ చిత్రం ఓటీటీ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై అక్కడ కూడా ప్రజాదరణ పొందింది.

Also Read: Mumbai Indians: ప్లే ఆఫ్స్‌ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా చేయండి!

సాలార్ పార్ట్ 2 ఉంటుందని ప్రకటించినప్పటి నుండి, సాలార్ 2 పై చాలా అంచనాలు ఉన్నాయి సినీ ప్రేక్షకులకి . ఇకపోతే తెలుగు సినిమాలకు జపాన్ లో కూడా మంచి మార్కెట్ ఉందని రానురాను స్పష్టం అవుతోంది. మన తెలుగు హీరోలకి అక్కడ కూడా చాలా మాది అభిమానులున్నారు. బాహుబలి, సాహో, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఎన్నో తెలుగు సినిమాలు జపాన్‌ లో అఖండ విజయాన్ని అందుకున్నాయి.

Also Read: Wound Healing: ఔషధ మొక్కను ఉపయోగించుకొని స్వీయ చికిత్స చేసుకున్న కోతి..

ఇక అసలు విషయానికి వస్తే.. సలార్ చిత్రం జపాన్‌ లో విడుదల కానుంది. హీరో ప్రభాస్ కు జపాన్‌లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. గతంలో ప్రభాస్ పేరుతో పండగలు, ఆయన పేరు మీద షాపులు, ప్రభాస్ బొమ్మలు అమ్ముడుపోవడం చూశాం.. ప్రస్తుతం జపనీస్ భాషలో సలార్ సినిమా విడుదలకు ఆక్కడి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జులై 14 నుంచి జపాన్ దేశవ్యాప్తంగా ‘సలార్’ సినిమా విడుదల కానుంది. మరి సలార్ గత చిత్రాల మాదిరిగానే జపాన్‌లో థియేటర్స్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందో లేదో చూడాలి.