Ms Dhoni: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎంఎస్ ధోనీ.. మరి ఐపీఎల్ సంగతేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే దానిపై మాహీ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న ప్రశ్న. అయితే, వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే విషయంపై ధోనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. మోకాలి గాయంతో బాధపడుతూనే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ 2023 అని ఫ్యాన్స్ స్టేడియాల్లోకి తెగ వచ్చారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 11 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చి 34.67 సగటుతో 104 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ధోనీ స్ట్రైయిక్ రేటు 185.71గా ఉంది.
Read Also: Girls Videos Row: కాలేజీ వాష్‌రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ధోనీ తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మించిన ఎల్‌జీఎం చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా ఇవాళ ( జూలై 28) విడుదలైంది. చెన్నైలో ఓ థియేటర్‌లో సినిమా యూనిట్‌తో కలిసి మాహీ భార్య సాక్షి సింగ్, ధోనీ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ధోనీకి తమిళ్ ఫ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం.. తమిళనాడుని తన సొంత రాష్ట్రంగా భావిస్తాడు.. ప్రస్తుతం ధోనీ గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు.. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడతాడు.. అయితే, మహీకి నటన కొత్తేమీ కాదు.. ఇప్పటికే అనేక యాడ్స్‌లో యాక్టింగ్ చేశాడు.. ఆయనకి కెమెరా ఫియర్ లేదు అని సాక్షి సింగ్ అన్నారు. మంచి స్క్రిప్ట్ దొరికితే ధోని హీరోగా నటించడానికి కూడా రెఢీగా ఉన్నాడు అంటూ సాక్షి సింగ్ కామెంట్ చేసింది.
Read Also: Potula Sunita: చంద్రబాబు చరిత్ర అంతా మహిళలను అడ్డుపెట్టుకుని చేసిందే
అయితే, స్వయంగా సాక్షి సింగ్ ఈ ప్రకటన చేయడంతో ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ 2024 సీజన్ ఆడడం ఖాయమే అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక, ధోనీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని సాక్షినే డిసైడ్ చేసేది.. ఐపీఎల్ 2020, 2022 సీజన్‌లో సీఎస్‌కే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నప్పుడు మొదట స్పందించింది కూడా ఆమెనే.. సాక్షి సింగ్ నిర్మించిన ఎల్‌జీఎం సినిమాకి యావరేజ్ రేటింగ్ వచ్చింది. ఈ మూవీలో హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించగా.. నదియా కీలక పాత్రలో నటించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!