NTV Telugu Site icon

Sajjanar: స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు..

Sajjanar

Sajjanar

క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురై గౌడవెల్లి గ్రామానికి చెందిన సోమేష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అని యువతకు సూచించారు. బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సజ్జనార్ అవిరామ కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read:FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పు.. అలాచేస్తే రెట్టింపు టోల్ చార్జీలు వసూలు

సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఈవిధంగా రాసుకొచ్చారు. “ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులై బలవన్మరణాలకు పాల్పడకండి. ఆలోచించండి.. మీరు క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో ఆలోచించండి. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్ప.. చనిపోవాలనే ఆలోచనే రాకూడదు. ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించిన అందులోనే.

Also Read:Nabha Natesh : నభా నటేష్ అందాల రచ్చ..

జీవ‌న ప్రయాణంలో ఒక్కసారి కిందపడితే.. సర్వం కోల్పోయినట్లు కాదు కదా. ఆముల్యమైన జీవితాన్ని అర్దాంతరంగా కాలదన్నుకోవద్దు. చీకటి వెలుగులా నిత్యం కష్టసుఖాలు అందర్నీ వెంటాడుతూనే ఉంటాయి. కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకోవాలి. పరిష్కార మార్గాలు వెతకాలి. ఎంత కష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా? చనిపోయినంత మాత్రాన సమస్యలు టక్కున మాయమవుతాయా!?.. బలవన్మరణం వద్దు.. బ‌తికి సాధించ‌డ‌మే ముద్దు” అని యువతకు సూచించారు.