Sajjala Ramakrishna Reddy: 60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి.. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే కోర్టుకు వెళ్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించేవారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తాం అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండేళ్ల నుంచి వాలంటీర్లపై చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వాలంటీర్ల వ్యవస్థ జగన్ తీసుకువచ్చారు.. ఇంటి దగ్గరకే పథకాలు అందిస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు ఇస్తే జనం తరుముతారు అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారని దుయ్యబట్టారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటీర్లను తప్పించారని విమర్శించారు. ఇప్పుడు పెన్షన్లకు డబ్బులు లేవని ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు తెలియదా? ఏమి జరిగిందో.. వాలంటీర్ల విషయంలో అని ప్రశ్నించారు సజ్జల.. జన్మభూమి కమిటీలు.. టీడీపీ జలగలతో ఉండేది.. ఇవాళ చంద్రబాబుకు పెన్షనర్లు శాపాలు పెడుతున్నారని తెలిపారు. సమాజంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదన్న ఆయన.. ఇప్పుడు 60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యిందన్నారు. రెండు మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తి అవుతుందన్నారు. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో పెన్షన్ల పంపిణీ వ్యవహరంలో టీడీపీ మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. చంద్రబాబు మీద ప్రజలు కోపంగా ఉన్నారు.. వాలంటీర్ల వ్యవస్థను ఎవ్వరూ ఏమి చేయలేరన్నారు. 20 మంది అధికారులు వైసీపీ వాళ్లు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారట.. అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారులు వాళ్ల తోత్తులు అయ్యి ఉండాలి అని దుయ్యబట్టారు సజ్జల.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
టీడీపీ కూటమి ఈసీ మీద ఒత్తిడి చేస్తున్నారు.. వారు లొంగిపోతున్నారు అని ఆరోపించారు సజ్జల.. అఖిల భారత అధికారుల బదిలీలకు ఈసీ కారణం చెప్పాల్సి ఉండేదన్నారు.. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన వైసీపీకి లేదన్నారు. పవన్ కల్యాణ్‌ది ఒక రాజకీయ పార్టీనా? అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమికి చెప్పడానికి ఏమీ లేదు.. కూటమి ఇచ్చే హామీలు కూడా గట్టిగా చెప్పడం లేదు.. ఇప్పటికే కూటమి మునిగిపోయింది, దివాళా తీసిందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు.. ఐదేళ్లలో వైఎస్ షర్మిల వివేకా హత్య గురించి మాట్లాడలేదు.. ఇప్పుడు మాట్లాడుతున్నారు అని దుయ్యబట్టారు. షర్మిల, సునితతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు.. బాబు చేతిలో పావులు అయ్యారు అని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?