శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక పై ఈసీ నోటీసుపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పార్టీ ప్లీనరీలో జగన్‌ను శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకోవాలని ప్రతిపాదించిన మాట వాస్తవం అన్నారు. అది నాయకుల, కార్యకర్తల ఆకాంక్ష. అయితే శాశ్వత అధ్యక్షుడు అనే ప్రతిపాదనను జగన్ తిరస్కరించారు. ఈసీ ఈ విషయం పై స్పష్టత అడిగింది. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న అంశం ప్లీనరీ మినిట్స్‌లో లేదన్నారు సజ్జల. ఐదేళ్ల కొకసారి అధ్యక్ష ఎన్నిక జరగాలని గత ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకున్నాం. ఇదే విషయాన్ని ఈసీకి వెల్లడించాం. కానీ ప్లీనరీ సమయంలో ప్రతిపాదన అంశం వార్తల్లోకి రావటంతో ఈసీ స్పష్టత అడిగింది. మా అధ్యక్షుడి ఎన్నిక ఐదేళ్ళకు ఒకసారి నిర్వహిస్తాం అనే అంశాన్ని సీఈసీకి స్పష్టం చేయనున్నాం.
Read Also: Bhuvaneshwar Kumar: భువిపై విమర్శలు.. మద్దతుగా ఆసీస్ మాజీ ప్లేయర్
మరోవైపు ఎన్టీఆర్ పట్ల సీఎం జగన్ అత్యంత గౌరవం ఇచ్చారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పేరు పెట్టీ సీఎం జగన్ గౌరవించారు. ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందో సీఎం జగన్ సభలో చెప్పారు..ఎన్టీఆర్ పేరు చరిత్రలో తెర మరుగు కావాలని కోరుకునే మొదటి వ్యక్తి చంద్రబాబు..ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెడితే చంద్రబాబు కుమిలిపోయి ఉంటాడు..ఇప్పుడు యూనివర్సిటీకి పేరు మార్చడంతో చంద్రబాబు లోలోపల సంతోష పడుతూనే ఉంటాడు.. ఎన్టీఆర్ పేరు వింటే చంద్రబాబుకు వెన్నుపోటు గుర్తుకు వస్తుంది.. ఎన్టీఆర్ విధానాన్ని చంద్రబాబు ఎక్కడైనా నడిపారా..? టీడీపీ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు ఎందుకు తొలగించారు?
వైఎస్సార్, ఎన్టీఆర్ చిరస్మరణీయంగా నిలిచే నాయకులు..రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరును చంద్రబాబు ఎందుకు పేరు మార్చారు..? అప్పుడు ఈ బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఎందుకు నోరు విప్పలేదు?? ప్రతి అంశాన్ని చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటాడు. అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నాడని మండిపడ్డారు సజ్జల.
చంద్రబాబు ఎన్టీఆర్ ను మానసికంగా క్షోభ పెట్టారు.అందుకే ప్రాయశ్చిత్తంగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఆరోగ్యశ్రీ వైయస్సార్ బ్రెయిన్ ఛైల్డ్. ఆయన పేరు మార్చినప్పుడు మనసుకు తెలియదా??యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమైన నిర్ణయం. కింగ్ జార్జ్ హాస్పిటల్ గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. మెడికల్ విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో వైఎస్సార్ వేసిన ప్రభావం విప్లవాత్మకమైందన్నారు సజ్జల.
Read Also: CM Jagan Speech LIVE: ఎన్టీఆర్‍ని మించిన నటుడు దేశంలో ఎక్కడా ఉండడు