NTV Telugu Site icon

Sajjala Ramakkrishna Reddy : మోడీని ఇష్టం వచ్చినట్లు తిట్టిందీ చంద్రబాబే

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna

బీజేపీ పిలవకపోయినా ఎన్డీయేలోకి వెళ్లాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోందంటూ విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పిలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. పిలుస్తారా…వెళతారా అన్నది ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయమని, అధికారం కోసమే కలిసే ప్రయత్నం చేస్తే ఆ కూటమికి రంగు, రుచి, వాసన ఉండదన్నారు. మోడీని ఇష్టం వచ్చినట్లు తిట్టిందీ చంద్రబాబేనని ఆయన అన్నారు. బీజేపీకి పార్ట్ నర్ గా ఉండి కూడా చంద్రబాబు కేంద్రం నుంచి ఒక్కటి కూడా సాధించుకు రాలేకపోయారన్నా్రు. జగన్ ఇండిపెండెంట్ గా ఉండి కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకుని రాగలుగుతున్నారని, అవసరం అయినప్పుడు ఏ అంశంపై అయినా అభిప్రాయాలను నిర్భయంగా చెప్పగలుగుతున్నారన్నారు.

Also Read : Maharastra : అనర్హత పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి.. 54 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసు

2014లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే చంద్రబాబు మళ్లీ ఇప్పుడు వల్లెవేస్తున్నారని, అంటే ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఘోరంగా మోసం చేసినట్లే కదా అని ఆయన ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు మోసం చేసి అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారని, ఎన్టీఆర్ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతీనే అక్రమంగా ఉంచుకున్నారు అని ముద్ర వేసింది టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వ హననం చేసే అలవాటు టీడీపీకే ఉందని, రాజకీయాన్ని బురదగా మార్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ ఆ తానులోని ముక్కే.. విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని సజ్జల వ్యాఖ్యానించారు.

Also Read : Malladi Vishnu : ఆంధ్రుల ఆరాధ్య దైవం వైఎస్ఆర్

Show comments