NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy : మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna

ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు మేము వెళ్లడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదని, నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చని, ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అడుగుతున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారని, బీజేపీ తో చంద్రబాబు పొత్తు తర్వాత బాబు కి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదన్నారు సజ్జల.

అంతేకాకుండా..’EVM ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పడం లేదు. మిగతా చోట్ల EVM ధ్వంసం వీడియో లు ఎందుకు బయట పెట్టలేదు. అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగాము…టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదు.. మా కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎన్నికల కమిషన్ బాబు వైరస్ తో ఇన్ఫెక్ట్ అయింది. బాధితులకు పార్టీ తరపున అండగా నిలుస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదుకుంటాం. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లున్నాడు. సిఎస్ ను తప్పించాలని టార్గెట్ తో రెండు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాది లాగా సిఎస్ పై దాడి చేస్తున్నారు. భయపెట్టి కాళ్ళ బేరానికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పదిరోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా…? కారణాలు లేకుండా సిఎస్ ను తప్పించాలని ఫిర్యాదు చేస్తున్నారు. వారం తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడ అవుతుంది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.