NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: ఎన్నికల సమయంలో టికెట్ల కోసం ఆందోళన సహజం..

Sajjala

Sajjala

ఎన్నికల సమయంలో టికెట్ల కోసం ఆందోళన సహజం అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. టికెట్ల కోసం డిమాండ్ లేక పోతే ఎత్తిపోయిన పార్టీ అంటారు.. మా ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము.. పార్టీ నేతల్లో ఏమైనా అసంతృప్తి వుంటే పిలిచి మాట్లాడతాం.. ఆ మాత్రం పోటీ, ఆందోళనలు లేకపోతే పార్టీ ఉన్నట్లు ఎలా తెలుస్తుందని ఆయన చెప్పారు. టీడీపీ లో పొలిట్ బ్యూరో తీర్మానాలు అన్నీ మొక్కుబడిగా తయారు అవుతాయి.. వైసీపీలో నాయకత్వానికి గుర్తింపు ఉంటుంది.. వందల్లో, వేలల్లో నాయకులు ఉంటారు.. కానీ కింది స్థాయిలో కార్యక్రమాలు జరగాలి.. ఒక కార్యక్రమానికి ముందు గ్రౌండ్ ప్రిపరేషన్ ముఖ్యం.. మెయిన్ స్ట్రీమ్ మీడియాను దాటి సోషల్ మీడియా వ్యవహరిస్తోంది.. ప్రత్యర్థులు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టండి అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Read Also: Chennai: 28 ఏళ్ల క్రితం హత్య.. నిందితుడు అరెస్ట్

అయితే, ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మా పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే.. పోటీ చేయటానికి నాయకులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అసంతృప్తుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అని అందరు అనుకుంటారు.. వచ్చే జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించబోతున్నాం.. అంబేద్కర్‌ ఆశయ సాధనలో వైసీపీ ఎప్పుడూ ముందు వరుసలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.