NTV Telugu Site icon

Skill Development Scam: స్కిల్‌ స్కామ్‌ కేసు.. ఆధారాలు బయటపెట్టిన సజ్జల..!

Sajjala

Sajjala

Skill Development Scam: చంద్రబాబు అవినీతి చేశారనడానికి అన్ని ఆధారాలున్నాయని తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు ఈ స్కామ్‌ ఎలా జరిగిందనే వివరాలను వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. వాళ్ల దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తోందంటూ ఆధారాలతో సహా టీడీపీ నేతలపై కౌంటర్‌ ఎటాక్‌ దిగారు.. గత ప్రభుత్వంలో డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని.. కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.. ఇక, స్కిల్‌ స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం వాటిల్లింది.. దోచుకోవడానికే ఓ స్కీమ్‌ పెట్టారు.. షెల్‌ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగింది.. పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చిందని.. నేషనల్‌ ఏజెన్సీలు కూడా దోపిడీ రిపోర్ట్‌ ఇచ్చాయని పేర్కొన్నారు.

Read Also: Quail Farming: కంజు పిట్టల పెంపకంతో ఆదాయాన్ని పొందుతున్న రైతులు..

ఈ ఒప్పందంతో తమకేం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందన్నారు సజ్జల.. గట్టిగా అరుస్తుంటే అబద్ధం నిజం అవుతుందని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతి నిరూపణకు పెద్ద పెద్ద లాయర్లు పెద్ద జ్ఞానం అవసరం లేదు.. సామాన్యులను అడిగినా చెబుతారన్నారు. దేశంలో ఉన్న చట్టాలకు చంద్రబాబు అతీతుడా..? అని నిలదీశారు. అరెస్టులో కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారన్న ఆయన.. 2014 సెప్టెంబర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు జరిగి.. అక్రమాలు మొదలయ్యాయి. అప్పటి ఫైల్స్ మొత్తం బాబు ధ్వంసం చేశారని ఆరోపించారు. దోచుకోవడానికి ఒక స్కిం పెట్టారు. చక్కగా స్కీం పెట్టి డబ్బులు కొట్టేశారు. రాత్రికి రాత్రి కేసులో కొంతమంది దేశం వదిలి పోయారన్నారు. 2014 సెప్టెంబర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. గంటా సుబ్బారావును దానికి ఎండీని చేశారు. 2015లో దాని పేరును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌గా మార్చారు. ఒక చిన్న కంపెనీ ఎండీని చంద్రబాబు లింక్‌ ఎందుకు చేశారు?. షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించింది నిజమా? కాదా?. జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు స్కిల్‌ స్కాం కేసు ఓ కేస్‌ స్టడీగా పనికి వస్తుందని అభిప్రాయపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Sajjala Ramakrishna Reddy About Chandrababu Naidu Involvement In Skill Development Scam | Ntv