Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy : ఇది చారిత్రాత్మక పరిణామం.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందే

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని, దీని కోసం వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ విధానం ఎందుకు ఎత్తుకున్నామో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇది చారిత్రాత్మక పరిణామమని, చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందేనని, ప్రజల అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనన్నారు సజ్జల.

 

పోటీ పెరగటం వల్ల పని తీరు మెరుగుపడి ప్రజలకు మరింత మేలు జరుగుతుందని, మాది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని ఆయన వెల్లడించారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామని, ప్రజలు మా పార్టీని ఓన్ చేసుకొన్నారని సజ్జల వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రజలు మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నామని, అంతిమ నిర్ణేతలు ప్రజలేనన్నారు. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదని, తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

Exit mobile version