Site icon NTV Telugu

Saina Nehwal: కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మండిపాటు..

Saina Nehwal

Saina Nehwal

మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలన్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మండిపడ్డారు. అమ్మాయిలు పోరాడగలరనే పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు. నేను భారత్ కు పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ ఏం ఆలోచించి ఉంటుంది..? ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా.. స్త్రీద్వేష వ్యక్తుల నుంచి అవమానం జరుగుతోంది. ఇది నిజంగా బాధాకరం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Madhya Pradesh: నేను చలాన్ కట్టను, ఎస్పీకి చెప్పండి.. మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ఓ వ్యక్తి వాగ్వాదం

కాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరను ఉద్దేశిస్తూ ఆయన కామెంట్స్ చేశారు. ‘ఆమె వంట గదికి మాత్రమే సరిపోతారు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. కర్ణాటకలోని దేవనగరి లోక్ సభ స్థానానికి ప్రస్తుత బీజేపీ ఎంపీ జీఎం సిద్ధేశ్వర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సిద్ధేశ్వర సతీమణి గాయత్రికి అవకాశమిచ్చింది. అటు కాంగ్రెస్ నుంచి శివశంకరప్ప కోడలు ప్రభా మల్లికార్జున్ ను ఎంపీగా నిలబెట్టారు. ఈ క్రమంలో.. కోడలి తరఫున ప్రచారం చేపట్టిన ఆయన.. కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. మరోవైపు.. శివశంకర్ప వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Read Also: BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాలకు దక్కని చోటు

Exit mobile version