Site icon NTV Telugu

Sailajanath : కక్ష్య పూరిత రాజకీయాలు కాకుండా… ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి

Sailaja 1

Sailaja 1

రాష్ట్రంలో ప్రజలు , సమస్యల గురించి ఆలోచించడం లేదన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలనే ప్రభుత్వం ఆలోచన ఉందన్నారు శైలజానాథ్‌. కక్ష్య పూరిత రాజకీయాలు కాకుండా… ప్రజలకు మేలు చేసే పనులు చేయాలన్నారు శైలజానాథ్‌. ఎవర్ని జైలులో పెట్టాలా అని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలోచిస్తున్నారని, ప్రభుత్వం చేతగాని తనం వల్ల అనంతపురం జిల్లాలో వంద ఎకరాల్లో కూడా వరి పంట సాగు చేయలేదన్నారు శైలజానాథ్‌. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే.. అంత మంచిదని, టీటీడీ బస్ దొంగతనం జరిగితే దిక్కులేదన్నారు. రాజధానిగా అమరావతిని ఉంచండి… లేదంటే మా రాజధాని మాకు ఇవ్వండని శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఎక్కడైనా మా రాజధాని ఏర్పాటు చేయండని, బీజేపీ ప్రమేయం లేకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదు అంటే… అన్ని వేళ్ళు బీజేపీ వైపు చూపిస్తున్నాయన్నారు శైలజానాథ్‌.

Also Read : Parineeti Chopra: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా.. పెళ్లి ఫొటోస్ వైరల్!

ప్రజాసమస్యలపై చంద్రబాబు-రాజశేఖర్ రెడ్డిల పోరాటం ఎంతో హుందాగా ఉండేది. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదు. రాష్ట్రంలో పరిపాలన కనిపించట్లేదు. చంద్రబాబు వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఆయన్ని ఇలా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం బాధాకరం. ఎన్టీఆర్ అభిమానిగా భువనేశ్వరి గారంటే నాకెంతో గౌరవం. ఏనాడు బయటకు రాని ఆమె ఇప్పుడిలా బాధపడుతుండటం ఎంతో కలచివేస్తోంది” అని ఆయన అన్నారు.

Also Read : Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి

Exit mobile version