CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్‌గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!
- సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారం కొత్త మలుపు
- సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు
- వైరల్‌గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడు సాయికృష్ణ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడంటూ అతడి తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు లేఖ అందజేయగా.. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేసి చంపిన సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసుల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో మే మొదటి వారంలో మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చినట్లు విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని తాను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన కుమారుడిని చూపించకుండా సీఐ నాగరాజు తీవ్రంగా బెదిరించారని ఆరోపించారు. తన కుమారుడి గురించి అడిగినప్పుడు ‘నీ కొడుకుని చంపేస్తాను.. ఫోటోకు దండ సిద్ధం చేసుకో’ అంటూ హెచ్చరించాడని విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను కొడుతున్నప్పుడు అతడి అరుపులు వినిపించాయని, అనంతరం పై అంతస్తుకు వెళ్లి కుమారుడిని చూసినట్లు కూడా విజయలక్ష్మి వివరించారు. అంతేకాకుండా స్టేషన్లోనే తన కుమారుడికి తీవ్ర చిత్రహింసలు పెట్టి హత్య చేసి, ఆ తర్వాత మృతదేహం ఆనవాళ్లు లేకుండా కాల్చివేసినట్లు తనకు సమాచారం అందిందని ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయం కోసం బంధువుల సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు.
సీఐ నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ నెల 19న నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు అందజేయగా.. కమిషనర్ ఎండార్స్మెంట్ ఆధారంగా కేసు నమోదు అయినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయికృష్ణ మృతి వ్యవహారం ప్రస్తుతం విజయవాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!