NTV Telugu Site icon

Saif Ali Khan Case: క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం సైఫ్ ఇంటికి నిందితుడు

Saif Ali Khan Case

Saif Ali Khan Case

Saif Ali Khan Case: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ముంబైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు ( Mumbai Police) నిందితుడిని క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం అతన్ని సైఫ్ అలీఖాన్ నివాసానికి, ఆపై బాంద్రా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు, నిందితుడి సహాయంతో సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగిన క్రైమ్‌సీన్ రీక్రియేషన్ (Crime Scene Reenactment) చేసారు. దాడి సమయంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ కెమెరాలో రికార్డ్ కాలేదు. దాంతో అతను సైఫ్ ఇంటి లోపలి ఎలా చేరుకున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం పోలీసులు మొదట నిందితుడిని సైఫ్ ఇంటిలోకి తీసుకెళ్లారు. అక్కడ క్రైమ్ సన్నివేశాన్ని రీక్రియేషన్ చేసిన తరువాత పోలీసులు సైఫ్ నివాసం నుండి బయలుదేరి ఆపై బాంద్రా రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు.

Also Read: Massive Encounter: ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి

ఇకపోతే, సైఫ్ అలీఖాన్ ఇటీవల బాంద్రా నివాసంలో దొంగతనానికి వచ్చిన నిందితుడిపై దాడి సమయంలో.. నిందితుడు సైఫ్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయల పాలయ్యాడు. ఈ దాడి జరిగిన వెంటనే సైఫ్‌ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ముంబై పోలీసులు ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్రైమ్‌సీన్ రీక్రియేషన్ చేపట్టారు. ఇక ఈ కేసులో భాగంగా 19 వేలిముద్రలను పోలీసులు ఘటన స్థలంలో కనుగొన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ (Shariful Islam) బంగ్లాదేశ్ నుండి మేఘాలయలోని దాకీ నది ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించాడు. అతను పశ్చిమ బెంగాల్‌లో కొంతకాలం నివసించాడు. అక్కడ నుండి అతను నకిలీ ఆధార్ కార్డును తయారు చేసి దాని ద్వారా అతను తన గుర్తింపును దాచిపెట్టి భారతదేశంలో తిరుగుతున్నాడు.