Site icon NTV Telugu

Nampally Public Garden : పబ్లిక్ గార్డెన్‌లో కలకలం సృష్టించిన తుపాకులు

Nampally Garden

Nampally Garden

నిన్న నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లో నిన్న గార్డెనింగ్‌ చేస్తుండగా తుపాకులు దొరికిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటన కలకలం రేపుతోంది. గార్డెనింగ్ చేస్తుండగా బయటపడ్డ రెండు తపంఛాలు, ఒక రివాల్వర్ లభ్యమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఒక కవర్లో చుట్టి చెట్లపొదల్లో పడేసిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గార్డెనింగ్లో బయటపడడంతో పోలీసులకు సమాచారం అందించారు గార్డెన్ సిబ్బంది. అయితే.. తుపాకులను స్వాధీనం చేసుకున్న సైఫాబాద్‌ పోలీసులు.. ఈ రోజు మరోసారి తుపాకులు దొరికిన ప్రాంతంలో పంచనామా నిర్వహించారు. తుపాకులు లభించిన రెండు మీటర్ల దూరంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి.
Also Read : AshokGajapathi Raju: ఏపీలో రాజ్యాంగం అమలు కావడంలేదు

అయితే ఈ సందర్భంగా ఎన్టీవీతో సైఫాబాద్‌ సీఐ సత్తయ్య మాట్లాడుతూ.. రెండు తపంఛాలు, ఒక రివాల్వర్ దొరికాయని, కవర్‌లో చుట్టి పడేశారని, మూడు తుపాకులు తుప్పు పట్టి ఉన్నాయని తెలిపారు. పడేసి చాలా రోజులు అవుతున్నట్లు తెలుస్తోందని, ఎవరు ఎందుకోసం తీసుకువచ్చి పడేసారో దర్యాప్తులో తేలుతుందని, తుపాకులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించామని ఆయన పేర్కొన్నారు. తుపాకులకు తుప్పు పట్టి ఎంత కాలం అవుతుందో తెలిస్తే సీసీ కెరాలను పరిశీలించవచ్చని, ప్రస్తుతం తుపాకులు దొరికిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు ఫీడ్ నెల రోజుల వరకే ఉంటుందని ఆయన అన్నారు.

Exit mobile version