Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, గతంలో నమోదైన క్రైమ్ నంబర్ 107/2026 ఎఫ్ఐఆర్ను ఆధారంగా తీసుకుని 2026 జూన్ 19న కేసు నమోదు చేసినట్లు పేర్కొంది సీబీఐ..
కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, లాకప్ డెత్తో పాటు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అయితే, ఇవి ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలేనని, వాటిపై దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది. అయితే, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐ ఏఎస్పీ నరేంద్ర దేవ్ చేపట్టినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 127(6), 103(1), 238 కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
Also Read
- Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
- Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
- Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
- Bonda Uma: నా కుమారుడికి మేయర్ సీటు అడిగిన మాట వాస్తవమే.. వంగవీటి ఎంట్రీతో..! బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగడం, పోలీసు అధికారితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాయి కృష్ణ మృతి వెనుక ఉన్న పరిస్థితులు, కస్టడీలో ఏం జరిగింది, మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల్లో వాస్తవాలేమిటన్న అంశాలపై సీబీఐ దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!