Site icon NTV Telugu

Sai Durga Tej : సాయి దుర్గా తేజ్ – ‘క’ దర్శకుల క్రేజీ కాంబో: ఉగాది రోజే ముహూర్తం!

Saiduga Tej

Saiduga Tej

ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఒకరు.‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సాయి దుర్గా తేజ్ ఎంచుకున్న వైవిధ్యమైన కథే ఈ ‘సంబరాల ఏటిగట్టు’. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, రూ. 125 – 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఒక పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్. ‘హనుమాన్’ వంటి విజువల్ వండర్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో తేజ్ ‘బలి’ అనే పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీ పనుల్లో బిజీగా ఉంటునే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మన మెగా హీరో..

Also Read : Udit Narayan : తెలియకుండానే ఆ ఆపరేషన్ చేయించారు.. ప్రముఖ సింగర్ పై మాజీ భార్య కెస్

గత ఏడాది కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శక ద్వయం సుజిత్ – సందీప్. తమ మొదటి సినిమాతోనే టెక్నికల్‌గా కథా పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఇద్దరు దర్శకులు, ఇప్పుడు సాయి దుర్గా తేజ్‌ను మెప్పించారు. వారు చెప్పిన వినూత్నమైన సబ్జెక్ట్ నచ్చడంతో తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కాగా ఈ సినిమాను ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది కూడా ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని, సుజిత్-సందీప్ మార్క్ సస్పెన్స్ లేదా యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని సమాచారం.

Exit mobile version