Site icon NTV Telugu

Sai Dharam Tej: సలార్, డంకీ, అక్వామెన్ చిత్రాలపై తేజ్ ట్వీట్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా

Sai Dharam Tej

Sai Dharam Tej

బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇక ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలవడం వరల్డ్ మూవీ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్‌ను కొనియాడింది. హాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం మన తెలుగు హీరోల డేట్స్ కోసం చూస్తు్న్నారు. దర్శక ధీరుడు జక్కన్న కోసం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమే చూస్తోంది. ఇక తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించెందుకు సలార్ మూవీ సిద్ధమైంది. రేపు వరల్డ్ వైడ్‌గా సలార్ మూవీ రిలీజ్ అవుతున్న క్రమంలో మన తెలుగు సినిమా గురించి సుప్రీం హీరో సాయి ధరమ్ చేసిన పోస్ట్ ఇండస్డ్రీ హాట్‌టాపిక్‌గా మారింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు ధీటు మన తెలుగు సినిమా రావడం గర్వంగా ఉందంటూ తేజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రియులే కాదు ఇండస్ట్రీ సైతం మాట్లాడుకుంటోంది.

Also Read: Nawaz Sharif: భారత్ చంద్రున్ని చేరుకుంటే.. పాకిస్తాన్ భూమిపై నుంచి లేవడమే లేదు..

ఇంతకి తేజ్ చేసిన ఆ పోస్ట్ ఎంటంటే.. ‘తెలుగు సినిమా త‌న స‌క్సెస్‌ఫుల్ ప్రయాణంలో నేడు ఉన్నత‌స్థితికి చేరుకుంది. మ‌న తెలుగు సినిమా స‌లార్ ఈ రోజు షారుఖ్‌ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో స‌రిస‌మాన‌మైన క్రేజ్‌తో రిలీజ్ అవ్వడం ఎంతో సంతోషంగా, గ‌ర్వంగా ఉంది. మూడు అగ్ర సినీ ప‌రిశ్రమలు ఒకే స‌మ‌యాన ప్రేక్షకుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ అనుభూతికి అందించేందుకు సిద్దం కావ‌డం గొప్ప విష‌యం. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీల్ క‌లుగుతుంది. ఈ అనుభూతి క‌ల‌గ‌డానికి కార‌ణ‌మైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. డంకీ చిత్రంతో వ‌రుస‌గా మూడు స‌క్సెస్‌ల‌తో హ్యాట్రిక్ విజయం స‌క్సెస్ సాధించిన షారుఖ్ ఖాన్ సార్‌.. యువ‌ర్ క‌మ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్‌.

Also Read: Sree Leela: సినిమానే ముఖ్యం.. పరీక్షలకు డుమ్మా కొట్టిన శ్రీలీల!

స‌లార్‌తో వెండితెర‌పై ఫైర్ క్రియేట్ చేయ‌డానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, హలీవుడ్ చిత్రం అక్వామెన్ సినిమాకు నా బెస్ట్ ఆఫ్ ల‌క్‌’ అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ పోస్ట్ చేశాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడికి ఇండస్ట్రీకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. తనదైన స్టైల్, డాన్స్, యాక్టింగ్ పర్ఫామెన్స్‌తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మూవీ రిజల్ట్ ఏదైనా ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండే తేజ్ ఎల్లప్పుడూ సినిమా గెల‌వాల‌ని, అందులో తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాల‌ని కోరుకుంటాడు. అందుకే బేధాభిప్రాయాలు తావు లేకుండా ఏ హీరో సినిమా అయినా రిజల్ట్ గొప్పగా ఉండాలని ఆశిస్తాడు. ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీ విషయంలో సాయి ధరమ్ తేజ్ స్పందించిన తీరు డార్లింగ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో తేజ్ ట్వీట్‌కు సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు.

Exit mobile version