Sai Dharam Tej: సలార్, డంకీ, అక్వామెన్ చిత్రాలపై తేజ్ ట్వీట్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇక ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలవడం వరల్డ్ మూవీ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్‌ను కొనియాడింది. హాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం మన తెలుగు హీరోల డేట్స్ కోసం చూస్తు్న్నారు. దర్శక ధీరుడు జక్కన్న కోసం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమే చూస్తోంది. ఇక తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించెందుకు సలార్ మూవీ సిద్ధమైంది. రేపు వరల్డ్ వైడ్‌గా సలార్ మూవీ రిలీజ్ అవుతున్న క్రమంలో మన తెలుగు సినిమా గురించి సుప్రీం హీరో సాయి ధరమ్ చేసిన పోస్ట్ ఇండస్డ్రీ హాట్‌టాపిక్‌గా మారింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు ధీటు మన తెలుగు సినిమా రావడం గర్వంగా ఉందంటూ తేజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రియులే కాదు ఇండస్ట్రీ సైతం మాట్లాడుకుంటోంది.
Also Read: Nawaz Sharif: భారత్ చంద్రున్ని చేరుకుంటే.. పాకిస్తాన్ భూమిపై నుంచి లేవడమే లేదు..
Also Read
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
- Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
ఇంతకి తేజ్ చేసిన ఆ పోస్ట్ ఎంటంటే.. ‘తెలుగు సినిమా తన సక్సెస్ఫుల్ ప్రయాణంలో నేడు ఉన్నతస్థితికి చేరుకుంది. మన తెలుగు సినిమా సలార్ ఈ రోజు షారుఖ్‌ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్‌తో సరిసమానమైన క్రేజ్‌తో రిలీజ్ అవ్వడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఒకే సమయాన ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి అందించేందుకు సిద్దం కావడం గొప్ప విషయం. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీల్ కలుగుతుంది. ఈ అనుభూతి కలగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. డంకీ చిత్రంతో వరుసగా మూడు సక్సెస్‌లతో హ్యాట్రిక్ విజయం సక్సెస్ సాధించిన షారుఖ్ ఖాన్ సార్.. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్.
Also Read: Sree Leela: సినిమానే ముఖ్యం.. పరీక్షలకు డుమ్మా కొట్టిన శ్రీలీల!
సలార్‌తో వెండితెరపై ఫైర్ క్రియేట్ చేయడానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, హలీవుడ్ చిత్రం అక్వామెన్ సినిమాకు నా బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ సాయిధరమ్ తేజ్ పోస్ట్ చేశాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడికి ఇండస్ట్రీకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. తనదైన స్టైల్, డాన్స్, యాక్టింగ్ పర్ఫామెన్స్తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మూవీ రిజల్ట్ ఏదైనా ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండే తేజ్ ఎల్లప్పుడూ సినిమా గెలవాలని, అందులో తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాలని కోరుకుంటాడు. అందుకే బేధాభిప్రాయాలు తావు లేకుండా ఏ హీరో సినిమా అయినా రిజల్ట్ గొప్పగా ఉండాలని ఆశిస్తాడు. ఇప్పుడు ప్రభాస్ సలార్ మూవీ విషయంలో సాయి ధరమ్ తేజ్ స్పందించిన తీరు డార్లింగ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో తేజ్ ట్వీట్‌కు సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు.
CINEMA IS WINNING 💪🏼❤️#TeluguFilmIndustry#HindiFilmIndustry#Hollywood pic.twitter.com/hmlLm6PaJC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 21, 2023
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..