Site icon NTV Telugu

Sai Dharam Tej : ఆ సీనియర్ హీరోయిన్ తో కలిసి చిందేసిన సాయి ధరమ్ తేజ్..

Whatsapp Image 2023 07 25 At 2.56.52 Pm

Whatsapp Image 2023 07 25 At 2.56.52 Pm

సీనియర్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు రాధ మెగాస్టార్ చిరంజీవితో కలసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.హీరోయిన్ రాధ ఒకప్పుడు మెగాస్టార్ తో పోటీపడి మరి స్టెప్పులు వేసేవారు.అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉండేది.ఇక ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాధ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ దూరం అయ్యారు.. ఇటీవలే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధ రియాలిటీ షో నీతోనే డాన్స్ షో కి జడ్జ్ గా వ్యవహారిస్తున్నారు. . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షోకి యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యారు.

సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా బ్రో ది అవతార్.ఈ సినిమా ఈనెల 28న విడుదల కానుంది.ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ నీతోనే డాన్స్ షోకి హాజరై సాయి ధరమ్ తేజ్ ఆడుతూ పాడుతూ ఎంతో సందడి చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వగానే ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటారు అని శ్రీముఖి ప్రశ్నించగా.. జీవితాంతం అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే తనకు సపోర్ట్‌గా క నటి సదా బ్రో అంటూ పిలిచింది.దీనికి సాయి తేజ్ మీరు బ్రో అంటే మేము వెళ్లవయ్యా వెళ్లు అంటాం అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ సీనియర్ హీరోయిన్ రాధా తో కలిసి స్టెప్పులు కూడా వేశాడు యముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం సాంగ్‌కి రాధ ఎంతో ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేసి ఆశ్చర్యపరిచింది.. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఇలా నేను చిరంజీవి గారితో డ్యాన్స్ చెయ్యలేకపోయాను కానీ మీతో కలిసి డ్యాన్స్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

Exit mobile version