హైదరాబాద్ బషీర్ బాగ్లోని సీసీఎస్ ముందు సాహితి ఇన్ ఫ్రా కంపెనీ బాధితులు ఆందోళనకు దిగారు. ఫ్రీలాంచ్ పేరిట 2500 మందిని మోసం చేశారంటూ బాధితులు నిరసన చేపట్టారు. శర్వాణి ఎలైట్ పేరుతో 10 టవర్లు నిర్మిస్తామంటూ రూ.1500 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్ తో బాధితులు బయటకొస్తున్నారు. ఉమామహేశ్వరరావు తమను వేధింపులకు గురి చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ వేగవంతం చేయాలని సాహితి ఇన్ ఫ్రా కంపెనీ బాధితులు ఆందోళనకు దిగారు.
Read Also: West Bengal: బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్లదాడి.. పరుగులు తీసిన భద్రతా సిబ్బంది, మీడియా..
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఈ అంశంపై సీసీఎస్ పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. తమకు వీలైనంత త్వరలో న్యాయం చేయాలని కోరామన్నారు. ఈరోజు 1200 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకులు తమను ఘోరంగా మోసం చేశారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ బాధ చెప్తామని.. తమకు ముఖ్యమంత్రి సమయం ఇవ్వాలని కోరారు. తామంతా రిటైర్డ్ ఉద్యోగులమని.. ఇళ్లు కోసం లోన్ తీసుకొని సాహితి గ్రూప్ లో పెట్టుబడి పెట్టామని చెప్పారు. 1200 కుటుంబాల వద్ద 900 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని సాహితీ గ్రూప్ చైర్మన్ లక్ష్మీనారాయణ మోసం చేశాడని బాధితులు చెబుతున్నారు. తమకు ఇళ్లైనా ఇవ్వండి.. లేదంటే తమ డబ్బులు అయిన తిరిగి ఇవ్వాలని కోరారు. తమ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
Read Also: Gannavaram Airport: ప్రయాణికుల లగేజీ ఎయిర్ పోర్టులోనే వదిలెళ్లిన విమానం