Sagar Canal: ఆరుగాల కష్టపడి పంట పండించిన రైతుకు ఎప్పుడూ ఎదురు దెబ్బలే తగులున్నాయి. విత్తు విత్తి నోటికాడికి వచ్చిందాకా పంట చేతికందుతుందో లేదో అన్న సందేహం రైతుల్లో ఉండనే ఉంటుంది. మరో సారి అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రలో చోటు చేసుకుంది. హెడ్‌క్వార్టర్ శివారులో అనుకోని ఘటన సంభవించింది. దీని కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన బేతవోలు వరద కాల్వకు ఉన్న ఎస్కేప్ గేట్ ఆదివారం రాత్రి ఒక్క సారిగా ఊడిపోయింది.
Read Also:Mehreen Pirzada: స్కిన్ టోన్ తో కట్టిపడేస్తున్న మెహ్రీన్..
ఈ ఘటనతో దిగువ ప్రాంతాల్లోకి సాగర్ ఎడమ కాల్వ నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో చిలుకూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో కోతకు వచ్చిన వందల ఎకరాల పంట నీట మునిగింది. అంతేకాకుండా కోత కోసి పొలాల్లో ఉంచిన మెదలు సైతం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తెల్లవారుజామున సాగర్ సీఈ రమేష్‌బాబు, ఎస్‌ఈ నరసింహరాజు కాల్వను పరిశీలించి నీటిని ఆపివేశారు. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. బేతవోలు చెరువు నింపేందుకు జేసీబీతో షట్టర్ తెరిచినట్లు పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు.
Read Also:Fishing Harbour Fire Accident: ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదా..?