NTV Telugu Site icon

Viral Video: పాపం.. రైల్వే ప్లాట్ ఫాంపై పడుకున్న వాళ్లపై నీళ్లు పోసిన ఓ పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video

Viral Video

వారు ఎక్కాల్సిన రైలు రాలేదని కాస్త విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై ఓ రైల్వే పోలీస్.. అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకున్న ప్రయాణికులపై నీళ్లు చల్లి లేపాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడున్న కాలంలో తోటి మనుషుల పట్ల గౌరవం, మర్యాద, దయ అనే లక్షణాలు చాలా మందిలో లేవు. కనీసం అవి లేకున్నా కానీ.. ఎలా అలవరుచుకోవాలో కూడా తెలుసుకోవడం లేదు. పెరిగిన టెక్నాలజీ వల్లనో లేదంటే పశ్చాత సంస్కృతి వల్లనో తెలియదు గానీ.. ఇతరుల పట్ల కనీస మానవత్వం చూపడం లేదు. అలాంటి సంఘటన ఇప్పడొకటి చోటుచేసుకుంది.

Read Also: Chattishghar : ప్రియుడి తో రాసలీలలు చేసేందుకు అడ్డుగా ఉన్న కొడుకును చంపిన తల్లి.. చివరికి..

మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్ లో వారు ఎక్కవలిసిన రైలు కోసం ఎదురుచూస్తూ.. పలువురు ఆ రైల్వే ప్లాట్ ఫామ్ పై నిద్రపోయారు. ఇందులో వృద్ధులు, యువకులు కూడా ఉన్నారు. అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ రైల్వే పోలీస్ అధికారి ప్లాట్ ఫామ్ పై తిరుగుతూ వృద్ధులు, యువకులపై నీళ్లు చల్లారు. దీంతో వాళ్లు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆర్ఐపీ హ్యుమానిటీ’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. కేవలం ట్విట్టర్ లోనే 4 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.

Read Also: Amarnath Yatra 2023: అమర్‌నాథ్‌ యాత్ర.. చూడాల్సిన అందాలివే..!

అంతేకాకుండా.. ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఆ పోలీస్ ప్రవర్తించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే.. ప్లాట్ ఫాంలపై నిద్రిస్తున్న ప్రయాణికుల సమస్యను పరిష్కరించే మార్గాలను కనుగొనాలని సూచించారు. ఓ యూజర్ ‘‘ఇది దారుణం. రైలు కోసం వేచి ఉన్నప్పుడు ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అమానుషం.’’ అని అన్నారు. మరోవైపు ఈ వీడియోపై పుణె డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఇందు దూబే స్పందించారు. ప్లాట్ ఫారమ్ పై పడుకోవడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని, అయితే ప్రయాణికులకు ఇలా చెప్పడం సరైన పద్దతి కాదని ఆమె ట్వీట్ చేశారు. ప్రయాణీకులతో హుందాగా, మర్యాదగా వ్యవహరించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.