Site icon NTV Telugu

Sadhvi Prachi : హ్యాండ్‌బ్యాగ్‌లో లిప్‌స్టిక్‌ కాదు కత్తులు పెట్టుకోండి..

Sadhvi Prachi

Sadhvi Prachi

హిందూ మహిళలు తమ పర్సులో లిప్ స్టిక్, దువ్వెనలు పెట్టుకోవద్దని, కత్తులు పెట్టుకోవాలని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షురాలు సాధ్వీ ప్రాచీ చెప్పడం వివాదాస్పదమైంది. జిహాదీలకు దగ్గరవ్వకుండా ఉండాలంటే హిందూ మహిళలు ఇలా చేయాలని అన్నారు. ఈ ఏడాది ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలా వివిధ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షురాలు సాధ్వీ ప్రాచీ మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఆమె ఈ సందర్భంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలు జిహాదీల దగ్గరికి రాకుండా అడ్డుకోవాలని అన్నారు.

Also Read : Bombs At University: ముసుగు ధరించి యూనివర్సిటీపై బాంబులతో దాడి.. వీడియో వైరల్

అందుకే మీ హ్యాండ్‌బ్యాగ్‌లో లిప్‌స్టిక్‌ను బదులుగా జిహాదీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కత్తిని ఉంచుకోవాలన్నారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను నరికి చంపిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. హిందూ మహిళలు కత్తులు కలిగి ఉండాలని అన్నారు సాధ్వీ ప్రాచీ. జమియత్ ఉలమా ఈ హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ ఓం అల్లా వ్యాఖ్యను కూడా ఆయన ఖండించారు, “మదానీకి హిందూ మతంలోని ఎ, బి, సి, డి తెలియదు.” అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన సాథ్వీ ప్రాచీ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన సాధ్వి ప్రాచీ 14 ఏళ్ల వయసులో మతపరమైన కార్యకలాపాలకు అంకితమయ్యారు.

Also Read : Somesh Kumar Applies For VRS: సోమేష్‌ కుమార్‌ విషయంలో అనుకున్నదే జరిగిందా..?

Exit mobile version