క్రికెట్ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్ కేరీర్ మలుపు తిరిగిన రోజు ఈరోజే (మార్చి 27, 1994). ముప్పేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ దేవుడిగా అవతరించాడు. టీమిండియా న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. ఇండియా రెగ్యూలర్ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆ మ్యాచ్ కు దూరమయ్యాడు. అంతలో కెప్టెన్ అజారుద్దీన్.. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలని సచిన్ టెండుల్కర్ కు చెప్పాడు. దీంతో.. ఆ పిలుపే సచిన్ కెరీర్ ను మలుపు తిప్పింది.
Kakarla Suresh: దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో కాకర్ల సురేష్
సచిన్ టెండూల్కర్ అప్పటి వరకు 69 వన్డేలు ఆడాడు. 30.84 సగటుతో 1,758 పరుగులే చేశాడు. అయితే సచిన్ అదృష్టమేంటో ఓపెనర్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే చితక్కొట్టేశాడు. 49 బంతుల్లో (15 ఫోర్లు, 2 సిక్స్‌లు) 82 పరుగులు చేసి దుమ్ముదులిపాడు. కాగా.. టీమిండియా 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఇక.. అప్పటి నుంచి సచిన్ దశ దిశ మారింది. మొత్తంగా 344 వన్డేలు ఆడి 48.29 సగటుతో 15,310 పరుగులు చేశాడు క్రికెట్ లెజెండరీ. మొత్తం 49 వన్డే సెంచరీలు ఉండటం విశేషం.
Currency notes: ఈ నేత ఎంత దోచుకున్నాడో..! నెట్టింట ఫొటో వైరల్
ఇదిలా ఉంటే.. మాజీ టీమిండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీతో సచిన్ టెండూల్కర్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1996-2007 మధ్య వన్డే క్రికెట్ చరిత్రలో ఈ ఇద్దరి మధ్య మంచి రికార్డు ఉంది. 136 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఇద్దరు క్రీజును పంచుకున్నారు. అంతేకాకుండా.. రెండుసార్లు నాటౌట్‌గా నిలిచారు. వీరి మధ్య అత్యధిక భాగస్వామ్యం 258 పరుగులు. 49.32 సగటుతో 6,609 పరుగులు సాధించారు. ఆ తర్వాత.. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ – మ్యాథ్యూ హెడెన్ మధ్య మంచి భాగస్వామ్యం ఉంది. వీరిద్దరూ 114 ఇన్నింగ్స్‌ల్లో 5,372 పరుగులు చేసి.. రెండో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు.
