NTV Telugu Site icon

Sachin Tendulkar: ‘రజతానికి’ వినేశ్ అర్హురాలే..

Sachin

Sachin

ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌కు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేశ్.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైంది. ఈ క్రమంలో.. వినేశ్ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) కోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. రజత పతకానికి వినేశ్ ఫొగాట్ అర్హురాలేనని అన్నారు. ఈ సందర్భంగా సచిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘అంపైర్‌ తీర్పునకు సమయం ఆసన్నమైంది. వినేశ్‌కు రజత పతకం వస్తుందని ఆశిద్దాం’ అని తెలిపారు.

Read Also: BJP: “ఢిల్లీ వెళ్లి ఖాళీ చేతులతో వచ్చాడు”.. ఠాక్రే పర్యటనపై బీజేపీ విమర్శలు..

క్రీడల్లో నిబంధనలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సచిన్ తెలిపారు. “ప్రతి గేమ్‌కు నియమాలు ఉంటాయి.. ఆ నియమాలను సందర్భోచితంగా చూడాల్సి ఉంటుంది. వినేష్ ఫోగట్ తన స్వచ్ఛమైన ఆటతో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఫైనల్ కు ముందు బరువు కారణంగా అనర్హత వేటు వేయడంతో రజత పతకానికి దూరమైంది. ఇందుకు సహేతుక కారణం కనిపించకపోవడంతో పాటు క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’’ అని సచిన్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు.

Read Also: Tihar Prison jailer: తీహార్ జైలర్ ఓవరాక్షన్.. బర్త్ డే పార్టీలో తుపాకీతో డ్యాన్స్

‘ఒక ఆటగాడు అనైతిక విషయాలను ఉపయోగిస్తే.. అతనిని అనర్హులుగా ప్రకటించడం సమర్థించాలి. కానీ వినేశ్ విషయంలో అలా జరగలేదు. వినేశ్ మొదటి నుంచి అద్భుతంగా ఆడి ఫైనల్ వరకు చేరుకుంది. ఆమె ఖచ్చితంగా రజత పతకానికి అర్హురాలే. స్పోర్ట్స్ కోర్టు నిర్ణయం కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. వినేశ్ కి తగిన గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.’ సచిన్ టెండూల్కర్ ఆమెకు బాసటగా నిలిచారు.

Show comments