Sachin Tendulkar: సూర్యకుమార్‌లా అమ్మాయి బ్యాటింగ్..సచిన్, జైషా ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమెన్స్ ఐపీఎల్‌కు సంబంధించిన ప్లేయర్ల వేలం సోమవారం విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లు ఈ లీగ్ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపగా ఫ్రాంచైజీలు అదే జోరుతో వేలంలో పాల్గొన్నాయి. కనీవిరీఎరుగని రీతిలో కాసుల వర్షం కురిపిస్తూ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఫ్యాన్స్ నుంచీ ఈ వేలానికి మంచి స్పందన లభించింది. ఇక ఇదే రీతిలో మ్యాచ్‌లు కూడా జరిగితే మహిళా క్రికెట్ మరో స్థాయికి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే భవిష్యత్‌లో క్రికెట్ బాట పట్టాలనుకున్న అమ్మాయిలకు ఇది ఎంతో ఊతమిస్తుంది. ఇదిలా ఉండగా రాజస్తాన్‌కు చెందిన ఓ అమ్మాయికి సంబంధించిన బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Cheteshwar Pujara: అరుదైన రికార్డుకు చేరువలో పుజారా.. రెండో టెస్టు ఆడితే!
Also Read
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
అయితే విమెన్స్ ఐపీఎల్ వేలం జరిగిన మరుసటి రోజే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడం విశేషం. ఇందులో ఓ బాలిక బ్యాటింగ్ చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులో ఆమె ప్రతి బంతినీ పర్ఫెక్ట్ టైమింగ్‌తో సిక్సర్లుగా మలుస్తూ కనిపించింది. ఈ వీడియో ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌నే ఆకర్షించింది. దీంతో ఆ అమ్మాయిని ప్రశంసిస్తూ సచిన్ మంగళవారం ఈ వీడియోను ట్వీట్ చేశాడు.
Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20
(Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023
“నిన్ననే వేలం జరిగింది. ఈ రోజే మ్యాచ్ మొదలైందా? క్యా బాత్ హై. నీ బ్యాటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాను” అనే క్యాప్షన్‌తో సచిన్ ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. సచిన్ ట్వీట్ చేసిన తర్వాత ఈ వీడియో మరింత వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ బాలికను స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌తో పోల్చుతున్నారు. అతనిలాగే ఈ బాలిక కూడా 360 డిగ్రీలలో షాట్లు ఆడుతూ కనిపించింది. సచిన్‌తో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఈ వీడియోను మెచ్చుకుంటూ పోస్ట్ చేయడం గమనార్హం.
Amazed by the young girl's cricket skills & passion for the game! I'm glad to see that the future of Women's Cricket is in good hands. Let us work together to empower our young athletes so that they can become future game changers! #GirlsInCricket #FutureStars @wplt20 @BCCIWomen pic.twitter.com/Bw5yv151wI
— Jay Shah (@JayShah) February 14, 2023
తాజావార్తలు
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!