కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు రూపుదిద్దేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 12 రకాల సదుపాయాలను ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
Also Read : Viral: పెళ్లికాముందుకే వద్దురా.. అని మీ నాన్న చెప్పినా వినలేదు.. ఇప్పుడు చూడు ఏమైందో
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడేళ్లలో మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను 3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నమని పేర్కొన్నారు. ఏ పనిలో కూడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రతి వస్తువును పది కాలాలపాటు ఉండేలా ప్రభుత్వం బ్రాండెడ్ వస్తువులను సమకూర్చుతున్నదని మంత్రి వెల్లడించారు.
Also Read : Beating Retreat Ceremony : ఘనంగా రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధాని
మన ఊరు – మన బడి (మన బస్తీ – మన బడి) అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడింది. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయలతో ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి దశలో 65 శాతం (సుమారు 13 లక్షల మంది) విద్యార్థులను కవర్ చేసేలా మొత్తం పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న 9,123 (35 శాతం) పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభించబడుతోంది.
