Viral: పెళ్లికాముందుకే వద్దురా.. అని మీ నాన్న చెప్పినా వినలేదు.. ఇప్పుడు చూడు ఏమైందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లికూతురు అందానికి ఫిదా అయిపోయాడు. దీంతో పెళ్లి తంతు పూర్తికాక ముందే ఆమె రూముకు పదే పదే వస్తుండడంతో చిరాకు తెచ్చుకున్న వధువు పెళ్లిని నిరాకరించింది. దీంతో వరుడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్లయింది. చిత్రకూట్ జిల్లాలో ఒక జంటకు పెళ్లి నిశ్చయమైంది. వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు. వధువరులిద్దరూ పెళ్లి దండలు మార్చుకున్నారు. మిగతా పెళ్లి ఆచారాలు జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె పట్ల పెళ్లికుమారుడు ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం చూసి తట్టుకోలేకపోయాడు. వధువు ఉన్న గదిలోకి పదే పదే వెళ్లాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణ వల్ల ఆ పెళ్లి రద్దైంది.
Read Also: Petrol Rates Hike : పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.35.. భారీగా పెరిగిన ఇంధన ధరలు
Also Read
కాగా, ఇది చూసిన వరుడి తండ్రి అలా చేయవద్దని చెప్పాడు. అయినప్పటికీ పెళ్లికుమారుడు లెక్క చేయలేదు. అలాగే అమ్మాయి రూమ్ లోకి వెళ్లాడు. దీంతో ఆగ్రహం పట్టలేని తండ్రి అందరి ముందు కుమారుడి చెంపపై కొట్టాడు. అయితే వరుడు కూడా తిరిగి తన తండ్రి చెంపపై కొట్టాడు. ఇది చూసిన బంధువులు, వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో వరుడితో పెళ్లికి వధువు నిరాకరించింది. అతడితో పెళ్లి క్యాన్సిల్ చేయాలని కుటుంబ సభ్యులను పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లిని రద్దు చేయాలని వధువరుల కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో వరుడి కుటుంబం, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!