NTV Telugu Site icon

Sabitha Indra Reddy : ఢిల్లీ తరహా విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నాం

Sabitha

Sabitha

విద్యార్థులలో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం నాడు తన కార్యాలయంలో జరిగిన విద్యా శాఖ పని తీరును సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో ఢిల్లీ తరహా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల విశ్వాసం, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినకుండా వారిలో మనోస్తైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

Also Read : Vemula Prashanth Reddy : ఎంపీకి కనీస అవగాహన లేదు

ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్ పట్ల ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.

Also Read : Telangana Assembly Session : ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఇవే చివరివా..?

మొదటి దశలో 8 జిల్లాలోని 24 మోడల్ స్కూళ్లను ఎంపిక చేసి 2500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణల పట్ల ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో మెరుగైన 1500 ఆవిష్కరణలను ప్రోత్సహించి. ఒక్కో ఆవిష్కరణ కు రెండు వేల రూపాయలను అందజేసి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేసి, వీరిని భవిష్యత్ లో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని అన్నారు.