హరితహారం కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండటంతో ఏర్పాట్లను ఆదివారం నాడు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , అధికారులతో కలిసి సభ స్థలం,వేదిక,మొక్కలు నాటే ప్రదేశం,పార్కింగ్,తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేసారు.అక్కడే సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు.
Also Read : JP Nadda: కాంగ్రెస్పై జేపీ నడ్డా ఫైర్.. 2014కి ముందు చాలా స్కాంలు చేశారని ఆరోపణ
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంభందించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుండి శ్రీకారం చుట్టడం సంతోషాదయకం అన్నారు.జిల్లా ప్రజల తరుపున ఘనంగా స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు.మ్యాక్ ప్రాజెక్ట్ ఎదురుగా గల హరితవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి వెంట ఎంపీ రంజిత్ రెడ్డి ,కలెక్టర్ హరీష్ , అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ , స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Also Read : Virendra Sachdeva: మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణానికి పాల్పడింది