Site icon NTV Telugu

Sabitha Indra Reddy : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 80 టీంలు.. లక్ష కళ్ళజోళ్ళు రెడీ

Sabitha Indrareddy

Sabitha Indrareddy

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రంగా రెడ్డి జిల్లా మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్ నగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నారని మంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 80 టీములు పనిచేస్తున్నాయని ఇప్పటికే లక్ష కళ్ళజోళ్ళు అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయం తో పని చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. 18 సంవత్సరాల నిండిన వారికి,వందరోజుల పాటు,వారానికి ఐదు రోజులు,ప్రతిరోజు 300 మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Also Read : UK: బ్రిటన్ పార్లమెంట్‌లో మోదీ డాక్యుమెంటరీపై రచ్చ.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ సిరీస్..

పరీక్షలు నిర్వహించిన వెంటనే కళ్లద్దాలు పంపిణీ జరుగుతుందని అదేవిధంగా ఆపరేషన్ అవసరం ఉన్నవారికి వారికి అందించిన తేదీలలో చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్,డిప్యూటీ కలెక్టర్ మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు, నాయకులు, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభిస్తున్నారు. అయితే.. కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులో చేర్చేందుకు రికార్డు స్థాయిలో సేవలు అందించనున్నారు.

Also Read : Mega Power Star Ram Charan: గోల్డెన్ గ్లోబ్ లో ఒక్క మగాడు

Exit mobile version