యంగ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల చేయబోతున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచిఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ట్రైలర్ ను రిలీజ్ చేశారు..
వరలక్ష్మి శరత్ కుమార్ కు గత కొంతకాలంగా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు.. ఆ తర్వాత కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. సర్కార్ వంటి పెద్ద సినిమాల్లో సూపర్ విలనిజం చూపించింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ ను వదిలి టాలీవుడ్ పై ఫోకస్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ అయింది. యశోద, వీర సింహారెడ్డి,రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అదే జోష్ లో ఇప్పుడు లీడ్ లో నటిస్తుంది.. శబరి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటుంది..
హీరో వరుణ్ సందేశ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ఆ ట్రైలర్ లోని సీన్స్ భయపెడుతున్నాయి.. సరికొత్త సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ ఓ రేంజులో ఉంది.. చనిపోయిన వ్యక్తి బ్రతికి ఎలా వస్తుంది అనే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.. చివర్లో వరలక్ష్మి శరత్ కుమార్ డ్యూయల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.. ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం ఆసక్తిగా ఉన్నాయి.. ఇక సినిమా ఏ విధంగా భయపెడుతుందో తెలియాలంటే మే 3 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమానికి నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..