SA20 2025: SA20 టీ20 లీగ్‌కు సర్వం సిద్ధం.. మ్యాచ్‌లను ఎక్కడ చూడచ్చంటే?
- SA20 టీ20 లీగ్‌కు సర్వం సిద్ధం.
- SA20 మూడో సీజన్ జనవరి 9, 2025 నుంచి ప్రారంభం.
- జోహన్నెస్‌బర్గ్ లో ఫిబ్రవరి 8న ఫైనల్ మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA20 2025: దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్ SA20 మూడో సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ జనవరి 9, 2025 నుంచి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ లీగ్ IPL తరహాలో నిర్వహించే ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీపడుతుండగా, విజేతలకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది.
Also Read: Champions Trophy 2025: ఈ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
Also Read
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
SA20 మూడో సీజన్ ప్రారంభ మ్యాచ్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, MI కేప్ టౌన్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జనవరి 9న పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది. ఇక లీగ్ మ్యాచ్ ల తర్వాత క్వాలిఫయర్ 1 ఫిబ్రవరి 4, ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్రవరి 5, క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఫిబ్రవరి 6, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 8, జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో రాత్రి 9 గంటలకు జరగనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం, చాలా మ్యాచ్‌లు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. కొన్ని సాయంత్రం 7 గంటలకు, మరికొన్ని 4:30 గంటలకు ప్రారంభమవుతాయి.
Also Read: Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేసిన మరో స్టార్ ప్లేయర్
ఇక ఈ ట్రోఫీ ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. టైటిల్ గెలిచిన జట్టుకు రూ.14.20 కోట్లు లభిస్తాయి. రన్నరప్, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు కోటి రూపాయల వరకు ప్రైజ్ మనీ అందుతుంది. ఇకపోతే, భారతీయ క్రికెట్ అభిమానులు SA20 లీగ్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో వీక్షించవచ్చు. ప్రత్యక్ష ప్రసారం కోసం Disney Plus Hotstar యాప్ లో మ్యాచ్ ను వీక్షించవచ్చు. SA20 లీగ్ మొదటిసారి 2022-23లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన రెండు సీజన్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకుంది. ఈ సీజన్‌లో కూడా అందరి దృష్టి ఈ జట్టుపైనే ఉంది.
తాజావార్తలు
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!