SA vs Ban: గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs Ban: క్రికెట్ అంటే జెంటిల్‌మెన్స్ గేమ్ అని చెబుతారు. కానీ, అప్పుడప్పుడూ ఈ ఆటకు మచ్చ కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘోర సంఘటనే మే 28 (బుధవారం)న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ జట్ల మధ్య నాలుగు రోజుల అనధికారిక టెస్టులో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఒకరినొకరు గ్రౌండ్ లోనే తోసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అసలు ఎందుకు ఇలా జరిగిందన్న విషయానికి వెళితే..
Read Also: COVID-19: మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?
Also Read
ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 105వ ఓవర్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ త్సెపో న్టులి బౌలింగ్ చేస్తుండగా, బ్యాటర్ రిపాన్ మోండోల్ అతని మొదటి బంతిని సిక్సర్‌గా మిడ్ వికెట్ మీదుగా బాదాడు. దీంతో కోపానికి గురైన న్టులి, బ్యాటర్ వద్దకు వెళ్లి ఏదో అంటూ వాగ్వాదానికి దిగాడు. దాంతో రిపాన్ అతన్ని వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా కోపంతో ఉన్న న్టులి రిపాన్‌ను తోసి, అతని హెల్మెట్ గ్రిల్‌ను పట్టుకుని ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. గొడవ పెద్దవుతున్న సమయంలో అప్పటికే మధ్యలోకి వచ్చిన అంపైర్, దక్షిణాఫ్రికా ఫీల్డర్లు ఇద్దరినీ విడదీశారు.
Read Also: Off The Record : వాళ్ళ కోసమే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆగుతుందా..??
ఈ ఘటనపై మ్యాచ్ అధికారుల పరిశీలన ప్రారంభమైంది. ఇరు జట్ల ఆటగాళ్లపై ఐసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ప్రమాదకర ఘర్షణ తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైనప్పటికీ, మైదానంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో మళ్లీ ఒకసారి స్పోర్ట్స్‌మన్‌షిప్ ఎక్కడికీ పోయిందనే చర్చ మొదలైంది. క్రికెట్‌లో ఇదో మరిచిపోలేని చెత్త ఘట్టంగా నిలిచిపోనుంది.
South Africa emerging player attacked on South Asian super power kanglu bangladesh player .#TerStegenOut pic.twitter.com/NNdvRVo1FK
— Vaibhu (@Vaibhualt_17) May 28, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!