S. J. Suryah : మహేష్ బాబుకు బాకీ పడ్డాను.. త్వరలోనే ఆ బాకీ తీర్చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జే సూర్య. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఓ వైపు నటుడుగా అదరగొడుతూనే మరోవైపు దర్శకుడిగా కూడా రానిస్తున్నారు..ఎస్. జె సూర్య ప్రస్తుతం విలన్ పాత్రలలో తనదైన శైలిలో నటించి మెప్పిస్తున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో తన మార్క్ కామెడీ తో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. రీసెంట్ గా ఎస్ జె సూర్య మార్క్ అంథోని అనే సినిమాలో నటించారు.. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.. రీసెంట్ గా ఈ ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజే చేశారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో విశాల్ , ఎస్ జె సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించి అందరినీ మెప్పించారు. ముఖ్యంగా ఎస్ జే సూర్య తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. ఈ సినిమాను తెలుగు మరియు తమిళ్ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.దీనితో ఎస్ జె సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. దర్శకుడిగా తమిళ్ లో అజిత్ కు సూపర్ హిట్ సినిమా ఇచ్చాను.అలాగే విజయ్ కు కూడా బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చాను అని ఆయన తెలిపారు. అలాగే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఖుషి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చాను కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రం నేను హిట్ ఇవ్వలేకపోయాను. ఆయనకు నేను బాకీ పడ్డాను. త్వరలోనే ఆయనతో ఓ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాను అని తెలిపారు. ఎస్ జె సూర్య మహేష్ బాబుతో ఇదివరకు నాని అనే చేసిన సంగతి తెలిసిందే. ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన నాని సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే మహేష్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ సినిమా లో ఎస్ జే సూర్య విలన్ గా నటించారు.ఈ సినిమా ప్లాప్ అయినా ఎస్ జె సూర్య నటన మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!